Tuesday, May 5, 2009

నీ గీతం

మది శ్రుతి చేయగ పాడింది నీ గీతం
ఉచ్వస నిచ్వసలు రాగమవగా
గుండె చప్పుడులు తాళమవగా
కల్లలోని నీరూపం పల్లవిగా
నీ చిలిపి చేష్టలు చరణలుగా
నా ఈ ప్రాణం, పాడింది నీ గీతం

నీ రూపo

ఒక మెరుపు మెరిసింది మదిలో
మనిదీపమై, నీ రూపమై
ఆకాశన హరివిలై, అజంతా శిల్పమై
కాళిదాసు కావ్యమై, రవివర్మ చిత్రమై
వికసించి పుష్పమై
అందానికి అందమై, అపురూపమై
నీ రూపమై

ఉషొదయం

ప్రతి ఉదయం ప్రపంచానికి సుర్యొదయం
నాకు మాత్రం ఉషొదయం
నా ఉష ఊసులతో ఆమె అడుగుల అలికిడితో
తన తొలి పలకరింపుతో
చిరునవ్వుల సుప్రభాతంతో
చల్లని చమంతి చూపులతో
అలరించె చిలిపి చేష్టలతో
ప్రతి ఉదయం
నాకు మాత్రం ఉషొదయం

చిరునవ్వూల వరమిస్తావా

విరజాజులు పూయించే నీ
నవ్వూల సిరినిస్తావా... చెలీ
చిరునవ్వూల వరమిస్తావా
ప్రేమనే మురిపించే నీ
మనస్సులో చోటిస్తావా
నా కలలకు ఓ రూపిస్తావా
నీ ప్రేమకై పరితపిస్తున్న ఈ
ప్రాణనికి పట్టిస్తావా
నా జీవితనికి ఓ దారిచుపిస్తావా
కడిగట్టి మసిబారిన ఈ
జీవితనికి ఓ వెలుగిస్తావా
మరో కొత్త రూపిస్తావా
చెలీ...చిరునవ్వూల వరమిస్తావా

ప్రేమే తెలియని ప్రియురాలు

ప్రేమే తెలియని ఒ ప్రియురాల
నన్నే కాదన్నవా, నాకు ప్రేమే లేదన్నవా.....
తలవని తలపులా
తీయ్యని వలపులా
నాలో చేరి, నన్నడించి
మెరుపై మెరిసి, ఉరుమును పంచి
చితిమంటలపై నన్నె చేర్చి
వెలుతున్నవా ఒ ప్రియురాల......
మనిషొక చోటై
మనసొక చోటై
చెలనం లేని బొమ్మగ మిగిలా
విషముని చల్లి, మంటలు రేపి
చావుని నాకే వరముగా ఇచ్చి
అనందించు ఒ ప్రియురాల

కాలం చేసిన గాయం

కాలం కవిత వ్రాదామని
కలం బదులు కత్తి తీసుకుంది
నా కర్మ ఏమిటోగాని నేను కాగితమైనాను
అలా మొదలు పెట్టి ఒక్క గీత గీసిందో లేదో
క్షతగాత్రుడినై నేలకొరిగాను.
విధి విచిత్రమెమొగాని
అది కాస్త నా నుదిటి వ్రాతైంది
చచేంత వరకు ఆ గాయాలతొ బ్రతకమంది
అలాని అని చేప్పి నాకు ఈ జీవితంతొ
పెద్దగా అనుబంధం ఎమి లేదు
నేను కవాలనుకున్నపుడు వదిలేయగలను
బహుశ ఇదేనేమొ నా చేతిలో మిగిలున్న చివరి అయుధం
ఈ బ్రతుకు పై పగ తేరుచుకొవటనికి

దాగుడుముతలు

నా దారిన నే పోతుంటే
వాకిలి మాటున వొదిగి
వొర చుపులు చూస్తవు
ఒకింత నే సాహసించి
కనులేత్తి చూస్తె కనుమరుగైతావు
ఒక నిమిషం నే నిలుచుని పలకరిస్తె
నీ సిగ్గుల చిరు నవ్వు వింటాను, తరువాత
దురమైయే నీ అందెల సడి వింటాను
ఏమిటో ఈ దాగుడుముతలు
ఏన్నలో ఈ మౌన వ్రతలు

చేలి మాయ

మాటలలో ఆ మౌనమేమిటో
కన్నులలో ఆ కొపమేలనో
కరునించ లేవా ఒ ప్రియా
కపాడ రావే నా ప్రియా...
మనసులో నీ రూపం
చెరిగిపోని నా ప్రానం
నా ప్రేమ నీవే ఒ సఖి
కరునించ రావే నా సఖి...
ఏ జన్మ బందం నీ స్నేహం
కదిలేను నాలో జీవమై
నా మనసు నీదే ఒ చేలి
కపాడ రావే నా చేలి...
రాత్రి లోన నీద్దుర ఉండదు
కలలతొ కునుకు పట్టదు
ఈ మాయ ఏమొ ఒ ప్రియా
నీ మాయ నేమొ నా ప్రియా