Tuesday, May 5, 2009

కాలం చేసిన గాయం

కాలం కవిత వ్రాదామని
కలం బదులు కత్తి తీసుకుంది
నా కర్మ ఏమిటోగాని నేను కాగితమైనాను
అలా మొదలు పెట్టి ఒక్క గీత గీసిందో లేదో
క్షతగాత్రుడినై నేలకొరిగాను.
విధి విచిత్రమెమొగాని
అది కాస్త నా నుదిటి వ్రాతైంది
చచేంత వరకు ఆ గాయాలతొ బ్రతకమంది
అలాని అని చేప్పి నాకు ఈ జీవితంతొ
పెద్దగా అనుబంధం ఎమి లేదు
నేను కవాలనుకున్నపుడు వదిలేయగలను
బహుశ ఇదేనేమొ నా చేతిలో మిగిలున్న చివరి అయుధం
ఈ బ్రతుకు పై పగ తేరుచుకొవటనికి

No comments: